చంద్రబాబు ఫోబియాతో ఏ1, ఏ2లు వణికిపోతున్నారు : బుద్దా వెంకన్న

చంద్రబాబు ఫోబియాతో ఏ1, ఏ2లు వణికిపోతున్నారు : బుద్దా వెంకన్న
X

చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలపై టీడీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీనిపై ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోన్న ఆ పార్టీ.. శనివారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసింది. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులే తరువాత అడ్డంకులు సృష్టించారంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారు ఆరోపించారు.

చంద్రబాబు ఫోబియాతో ఏ1, ఏ2లు వణికిపోతున్నారంటూ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. మూడు ముక్కలాట తుస్కుమనడంతో పెయిడ్‌ ఆర్టీస్టులను రంగంలో దించి చంద్రబాబు యాత్రకి అడ్డుపడ్డారని ఆరోపించారు.

రాజకీయ కక్షలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. దాడులు, కోడిగుడ్లు వేయడం లాంటివి విశాఖ సంస్కృతి కానే కాదన్నారు. ఆందోళనకారులు ఎయిర్‌పోర్టులోకి రాకుండా ఎందుకు నిలువరించలేకపోయారో పోలీసులు సమాధానం చెప్పాలన్నారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న కేసులో 54 మందిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నందుకు.. వాహనాలపై చెప్పులు, టమాటలు, గుడ్లు విసిరినందుకు 32 మంది వైసీపీ నాయకులపై కేసులు పెట్టారు. అలాగే మరో 20 మంది టీడీపీ నాయకులతో పాటు.. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ప్రజా సంఘాల నాయకుడు జేటీ రామారావు, వైసీపీ నాయకురాలు కృపాజ్యోతిపై సెక్షన్‌ 46,47,48 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. రామారావు, కృపాజ్యోతిని విశాలాక్షి నగర్‌లో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసులు నమోదైన వారిలో వైసీపీ, టీడీపీ ముఖ్య నాయకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదే సమయంలో... చంద్రబాబు అడ్డుకునేందుకు వైసీపీ సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో రచ్చరచ్చ చేసిన జగన్ మహిళా సంఘం సభ్యులు పోలీసు కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. చంద్రబాబును అడ్డుకోవడం వెనుక వైసీపీ స్కెచ్ ఉందన్న అంశం మరోసారి వెల్లడైందని ఆరోపిస్తోంది టీడీపీ..

ఈ సారి రోడ్డుమార్గం లేదా ట్రైయిన్‌ లో.. విశాఖకు రావాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్డు మార్గంలో వస్తే.. చంద్రబాబు యాత్రను అడ్డుకోవడం సాధ్యం కాదని, ఈ సారి యాత్రను సక్సెస్‌ చేసి తీరుతామంటున్నాయి టీడీపీ శ్రేణులు.

Tags

Next Story