విషాదం.. ఇంట్లో నలుగురు ఆత్మహత్య

విషాదం.. ఇంట్లో నలుగురు ఆత్మహత్య
X

హైదరాబాద్‌లోని హస్తినాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు సహాదంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగానే కుంటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రదీప్, స్వాతి దంపతులు, వారి కుమారులు కల్యాణ్, జయకృష్ణలుగా గుర్తించారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్న ప్రదీప్‌కు ఆర్థిక సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. నాన్న క్షమించండి అంటూ సూసైడ్‌ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పిల్లలు కూడా భారం కాకూడదనే ఉద్దేశంతో అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సూసైడ్‌ నోట్‌ రాశాడు.

40 లక్షల రూపాయల కోసం తన కొడుకు ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రదీప్‌ తండ్రి.. శుక్రవారం రాత్రి ప్రదీప్‌తో మాట్లాడనని.. ఆదివారం కరీంనగర్‌ వెళ్తానని చెప్పి పెట్టేసిన తరువాత.. మళ్లీ ఫోన్‌ రాకపోవడంతో ఇంటికి వెళ్లి చూస్తూ.. నలుగురు చనిపోయి కనిపించారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

తన కూతురు.. అల్లుడు చాలా అన్యోన్యంగా ఉండేవారని స్వాతి తండ్రి అన్నారు. వారి మధ్య ఎలాంటి మనస్పర్థలు, కలహాలు లేవని.. కోట్ల ఆస్తి.. మంచి ఉద్యోగం ఉన్న తన అల్లుడు 40 లక్షల రూపాయల అప్పు కోసం చనిపోతాడని తాను అనుకోవడం లేదన్నారు.

Next Story

RELATED STORIES