తిరుపతిలో బీసీ సంఘాల నేతల ఆందోళన

X
TV5 Telugu3 March 2020 3:40 PM GMT
తిరుపతిలో బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏపీ సీఎం జగన్ బీసీల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి వెనుకబడిన వర్గాల నుంచి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత ఆ హామీని గాలికొదిలేశారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లు అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. అయితే బీసీ నేతలను అలిపిరి దగ్గర టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో బీసీ సంఘాల నేతలకు విజిలెన్స్ సిబ్బంధికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Next Story