కోవిడ్-19 వ్యాపించకుండా అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణతో పాటు.. ఢిల్లీలోనూ ఓ పాజిటివ్ కేసు నమోదు కావడంతో.. అటు కేంద్రం సైతం అలర్ట్ అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశాయి. వైరస్ ప్రబలితే ఎదుర్కొనేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఇందులో భాగంగా.. కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశల మేరకు.. తెలంగాణ నుంచి ఇద్దరు కోఆర్డీనేటర్లను కేరళ పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల కేరళలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల కారణంగా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చేపట్టిన చర్యలపై అధ్యయనం చేసేందుకు.. ఇద్దరు కోఆర్డినేటర్లను కేరళకు పంపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com