జర్నలిస్టు సునీల్ రెడ్డి దారుణ హత్య

X
TV5 Telugu3 March 2020 2:00 PM GMT
వరంగల్‌లో జర్నలిస్టు సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితుడికి సహాయం చేద్దామని వెళ్లి సునీల్ రెడ్డి మృత్యువాత పడ్డాడు. బెంగళూరు బేకరీ యజమాని దయ అతడి సోదరుడు కలిసి బేకరీ పెట్టేందుకు కృష్ణారెడ్డి అనే వ్యక్తి దగ్గర 8 లక్షల రూపాయల అప్పు తీసుకొని తిరిగి చెల్లించంచడం లేదు. అతడి మితృలైన దేవేందర్ రెడ్డి, సునీల్ రెడ్డిలు బాకీ తీర్చమని అడిగేందుకు వెళ్లారు. అదే సమయంలో పథకం ప్రకారం బేకరీ యజమాని దయ అతడి సోదరుడు కలిసి కిరాయి హంతకులను మాట్లాడుకొని కత్తులతో సునీల్ రెడ్డి, దేవందర్ రెడ్డిలపై దాడులు చేశారు. ఈ దాడిలో జర్నలిస్టు సునీల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. దేవంద్ రెడ్డిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సునీల్ రెడ్డి హత్యతో పస్రా పట్టణంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Next Story