బిగ్ బ్రేకింగ్.. అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరిన అమరావతి ఉద్యమం

బిగ్ బ్రేకింగ్.. అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి ఉద్యమం అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరింది. రాజధాని కోసం దీక్షలు, ర్యాలీలు చేస్తున్న వారి పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందంటూ అమెరికా NRIలు, నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. రైతులు, మహిళలపై జరుగుతున్న దమనకాండను కోర్టు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి NRI విభాగం తరపున శ్రీనివాసరావు కావేటి హేగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని 'హెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్స్ యూనిట్ ప్రాసిక్యూటర్' అకనాలెడ్జ్‌మెంట్ ఇచ్చారు.

త్వరలో ఇదే అంశంపై జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మావనహక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేయాలని USAలోని NRIలు నిర్ణయించుకున్నారు. అమరావతిలో మానవ హక్కుల ఉల్లంఘనపై అన్ని వీడియో ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళల్ని అక్రమ నిర్బంధం, అరెస్ట్‌లపై పోరాటం కొనసాగిస్తామంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story