స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్‌ రివ్యూ

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్‌ రివ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి.. ఎన్నికల నెలగా మారబోతోంది. ఈ నెలలోనే ఎంపీటీసీ-జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది ఏపీ సర్కారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంటీసీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓకే అంటే.. ఈ నెలలోనే మూడు ఎన్నికలు ఏపీలో జరగనున్నాయి. ఈ నెల 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ, 10న మున్సిపల్ ఎన్నికలు, మార్చి 15న గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 21 జడ్పీటీసీ, ఎంపీటీసీ, 24న మున్సిపల్‌, 27న పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

మంగళవారం.. స్థానిక ఎన్నికలపై రివ్యూ చేసిన సీఎం జగన్‌.. నెలరోజుల్లోపు ఎన్నికలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని అన్నారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెట్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చామని వివరించారు. డబ్బులు, లిక్కర్‌లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్‌ తెచ్చామని అన్నారు. డబ్బులు పంచుతూ, ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు విధిస్తామని.. వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుందని సీఎం జగన్ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story