ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా మావైపు వస్తారు : దిగ్విజయ్ సింగ్

ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా మావైపు వస్తారు : దిగ్విజయ్ సింగ్

మార్చి 26 న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు ముందు, మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది, బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్

నేతలు ఆరోపించారు. అందులో బంగంగా 10 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీలోని ఓ హోటల్ కు తరలించినట్టు ఆరోపించారు. అయితే అలా వెళ్లిన ఎమ్మెల్యేల్లో ఆరుగురు కాంగ్రెస్ తోనే ఉంటామని చెప్పినట్టు వెల్లడించారు.

మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలతోను కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ కూడా ANI తో మాట్లాడుతూ, బిజెపి సీనియర్ నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) శాసనసభ్యురాలిని చార్టర్డ్ విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బిజెపి హార్స్ ట్రేడింగ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ శిభిరం లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా తిరిగి వస్తారని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story