ఇండియా వచ్చే యూఏఈ ప్రయాణీకుల కోసం న్యూ సెల్ఫ్ డిక్లరేషన్‌ ఫారం

ఇండియా వచ్చే యూఏఈ ప్రయాణీకుల కోసం న్యూ సెల్ఫ్ డిక్లరేషన్‌ ఫారం

రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభణ మరింత పెరిగిపోతుంది. చైనాలోనే కాకుండా దీని వ్యాప్తి ఇతర దేశాలకు కూడా వేగంగా జరుగుతుంది. ఈ నేపధ్యంలో మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈ నుంచి ఇండియాకి వచ్చే భారత వలసదారులు, ఇతర ప్రయాణీకులు ఓ సెల్ఫ్

డిక్లరేషన్‌ ఇవ్వాల్సి వుంటుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, అన్ని ఎయిర్‌లైన్స్‌లు ప్రయాణీకులకు సెల్ఫ్ డిక్లరేషన్‌ పత్రాలను అందించాలని కోరింది. ఈ సెల్ఫ్ డిక్లరేషన్‌ పత్రాల్లో, ప్రయాణీకులు తమ పూర్తి వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. 14 రోజులుగా తాము ఏయే దేశాల్లోని ఏయే

ప్రాంతాల్లో పర్యటించిందీ దాంట్లో పేర్కొనాలి. అదే సమయంలో ఇండియాలో ఎక్కడికి వెళుతున్నారు, వారి అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ వంటివి కూడా ప్రస్తావించాల్సి వుంటుంది. దగ్గు, జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యలపైనా డిక్లరేషన్‌లో ప్రస్తావించాల్సిందే. కాగా, చైనా, హాంగ్‌కాంగ్‌, సౌత్‌ కొరియా, ఇటలీ, ఇరాన్‌ మరియు ఇతర కోవిడ్‌ 19 ఎఫెక్టెడ్‌

దేశాల నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్‌ తప్పనిసరి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story