ఢిల్లీ అల్లర్లలో మరణించిన పోలీసు అధికారులకు ఎన్నారైల శ్రద్దాంజలి

ఢిల్లీ అల్లర్లలో మరణించిన పోలీసు  అధికారులకు ఎన్నారైల శ్రద్దాంజలి
X

ఢిల్లీలో జరిగిన అల్లర్లలో మరణించిన పోలీసు అధికారులకు అమెరికాలోని ప్రవాస భారతీయులు శ్రద్దాంజలి ఘటించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆప్ బీజేపీ న్యూజెర్సీలోని ఎడిసన్ ప్రాంతలో ఈ సంతాప సభను ఏర్పాటుచేసింది. ఇందులో ఐబి అధికారి అంకిత్ శర్మ, కానిస్టేబుల్ రతన్ లాల్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు సహాయ నిధిని సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించి, ఢిల్లీలో శాంతిని నెలకొల్పాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తిచేశారు.

Next Story

RELATED STORIES