'కరోనాను ఎమర్జెన్సీగా ప్రకటించండి' : కేజ్రీవాల్

కరోనాను ఎమర్జెన్సీగా ప్రకటించండి : కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కరోనావైరస్ వ్యాప్తిపై మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు.. దేశ రాజధాని ఢిల్లీలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ గురించి బయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రసుత్తం ఉన్న పరిస్థితులను ఎమర్జెన్సీగా భావించి టాస్క్‌ఫోర్స్‌ విభాగం పనిచేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. "కరోనావైరస్ పరిస్థితిని అత్యవసరంగా పరిష్కరించమని టాస్క్ ఫోర్స్ సభ్యులను కోరినట్టు అని ఆయన చెప్పారు.

అవసరమైతే, దేశ రాజధానిలోని లేడీ హార్డింగ్ ఆసుపత్రిలో మరియు ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో కరోనావైరస్ పరీక్షా ప్రయోగశాల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కరోనావైరస్ సోకిన ఢిల్లీ వ్యక్తితో సంప్రదించిన 88 మందిని.. అధికారులు గుర్తించారని, వీరందరినీ ఇన్ఫెక్షన్ కోసం పరీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. భారతదేశం ఇప్పుడు అన్ని దేశాల నుండి వచ్చే ప్రయాణికులను పరీక్షించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ ప్రకటించిన కొద్దిసేపటికే కేజ్రీవాల్ కరోనావైరస్ గురించి మీడియాకు వివరించారు. కాగా ఇప్పటికే దేశంలో కరోనావైరస్ కేసులు 28 కి చేరుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story