తాజా వార్తలు

రాజకీయ అండతోనే నాపై దాడి చేశారు: రాహుల్ సిప్లిగంజ్

రాజకీయ అండతోనే నాపై దాడి చేశారు: రాహుల్ సిప్లిగంజ్
X

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తనపై దాడిచేసిన వారిపై గచ్చిబౌలి పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రాజకీయ అండతోనే గత రాత్రి క్లబ్ లో తనపై దాడి చేశారని రాహుల్ ఆరోపించాడు. తనతోపాటు క్లబ్ కు వచ్చిన అమ్మాయిలను వారు అసభ్యకరంగా కామెంట్ చేశారని.. వారిని ప్రశ్నించినందుకే దాడికి పాల్పడ్డారని వివరించాడు. పదిమంది కలిసి బీరు బాటిళ్లతో తనపై దాడి చేశారన్నాడు. ఎంత రాజకీయ అండ ఉన్నా పోలీసులు ఈ విషయంలో తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని రాహుల్ అన్నారు.

Next Story

RELATED STORIES