ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఐదు దశాబ్దాలుగా పత్రికారంగంలో పనిచేసిన వ్యక్తి. తెలుగు పత్రికా సంపాదకునిగా, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ అధ్యక్షునిగా పలు హోదాలలో పనిచేశారు. 1934, ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించిన.. పొత్తూరి వెంకటేశ్వర్‌రావు.. 1957లో ఆంధ్రజనత పత్రికలో చేరి పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రభూమి పత్రికతో ఆతనికి అనుబంధం ఉంది. ఆంధ్రప్రభ, వార్త పత్రికలలో సంపాదకులుగా చాలాకాలం పనిచేశారు. తండ్రి పేరు వెంకట సుబ్బయ్య,. తల్లి పేరు పన్నగేంగ్రమ్మ. ఉద్యోగరీత్యా అనేక పదవులను పోషించారు. హైద్రాబాదులో స్థిరపడ్డారు. ఆధ్యాత్మిక అంశాలు, తెలుగు మహనీయులు, పత్రికా విలువలు, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయం మొదలైన వివిధ అంశాలపై రచనాలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com