రాజ్‌భవన్‌లో ఘనంగా ప్రపంచ మహిళాదినోత్సవ వేడుకలు

రాజ్‌భవన్‌లో ఘనంగా ప్రపంచ మహిళాదినోత్సవ వేడుకలు
X

మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ప్రొత్సహిస్తే...మరింత మంది వారిని ఆదర్శంగా తీసుకుంటారని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు .హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని.. తాను వైద్యురాలిగా, రాజకీయనాయకురాలిగా, గవర్నర్‌గా ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు .అనంతరం ఆయా రంగాల్లో ప్రతిభకనబర్చన మహిళలను ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా శిశుసంకేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్యే గొంగిడి సునీత,వైసీపీ ఎమ్మెల్యే రోజా తో పాటు పలువురు మహిళలు హాజరయ్యారు.

Tags

Next Story