ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం అయింది. మొత్తం 10 వేల 336 ఎంపీటీసీ, 660 జడ్పీటీసీ, 102 పురపాలక, నగరపాలక, నగర పంచాయితీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న తొలిదశ, 24న రెండో దశ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఈనెల 27న మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 29న మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి స్థానాల సంఖ్యలో మార్పులుండే అవకాశం ఉంది. మరోవైపు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో 2020 జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.
శ్రీకాకుళం : బీసీ(మహిళ)
విజయనగరం : జనరల్
విశాఖపట్నం : ఎస్టీ(మహిళ)
తూర్పు గోదావరి : ఎస్సి
పచ్చిమగోదావరి : బీసీ
కృష్ణా : జనరల్(మహిళ)
గుంటూరు : ఎస్సి (మహిళ)
ప్రకాశం : జనరల్ (మహిళ)
నెల్లూరు : జనరల్ (మహిళ)
చిత్తూరు : జనరల్
కడప : జనరల్
కర్నూల్ : జనరల్
అనంతపురం : బీసీ (మహిళ)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com