తూర్పు గోదావరి జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారి

తూర్పు గోదావరి జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారి

తూర్పుగోదావరి జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. ఉప్పలగుప్తం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సిహెచ్‌. కుమారి దేవి 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన మనోహరం అనే వ్యక్తి..ఫ్యా మిలీ మెంబర్ సర్టిఫికేట్‌ కోసం దరఖాస్తు చేయగా.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కుమారిదేవి 14వేల లంచం డిమాండ్‌ చేశారు. చివరికి బేరాల అనంతరం ఇద్దరి మధ్య 10వేలకు ఒప్పందం కుదిరింది. అవినీతి చేపకు బుద్ధి చెంపాలని నిర్ణయించుకున్న బాధితుడు.. లంచం అడిగిన వ్యవహారం గురించి ఏసీబీ వాళ్లకు సమచారం ఇచ్చారు. డబ్బులు ఇస్తున్న సమయంలో.. ఏసీబీ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కుమారిదేవిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతి అధికారిపై కేసు నమోదు చేసి.. డబ్బులు, సంబధిత రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి అధికారిని అదుపులోకి తీసుకుని రాజమంత్రి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story