కరోనా ఎఫెక్ట్‌తో వెలవెలబోతున్న రెస్టారెంట్లు, ఆర్టీసీ బస్సులు

కరోనా ఎఫెక్ట్‌తో వెలవెలబోతున్న రెస్టారెంట్లు, ఆర్టీసీ బస్సులు

తెలంగాణలో కరోనా అనుమానిత కేసులు పెరగటంతో.. దీని ప్రభావం ఆర్టీసీ పైన, రెస్టారెంట్లపైన పడింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. అత్యవసరమైతే తప్ప ప్రయాణికులు బస్సెక్కడం లేదు. చాలావరకు ముఖాలకు కర్చీప్ లు కట్టుకుని వెళ్తున్నారు.

అటు.. వైరస్‌ ఎఫెక్ట్‌ రెస్టారెంట్లు.. ఆన్‌లైన్‌ ఫుడ్‌పైన పడింది. ఎప్పుడూ బిజీగా కనిపించే హైదరాబాద్‌ రెస్టారెంట్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ముక్క లేనిదే ముద్ద దిగని భాగ్యనగర వాసులు బిర్యానీ తినాలంటానే హడలిపోతున్నారు. రెస్టారెంట్‌ వైపు చూడాలంటే కరోనా గుర్తుకు వస్తోంది. స్విగ్గి, జమోటా, ఉబర్‌ ఈట్స్‌ అంటూ మొబైల్‌లోనే ఆర్డర్‌ చేసే హైదరాబాదీలో కరోనా టెన్షన్‌తో.. ఇంటి పుడ్‌కే ఓటేస్తున్నారు. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌లో సగానికిపైగా పడిపోయాయి.

Tags

Read MoreRead Less
Next Story