తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో దారుణం జరిగింది. నిస్సహాయురాలైన ఓ యువతిపై కొందరు దుర్మార్గులు సామూహిక అత్యాచారం చేశారు. వదిలేయమని బతిమాలుతున్నా కనికరించలేదు. దారుణం చేశాక.. ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. మండపేట మండలం ఇప్పటపాడుకు చెందిన ఓ విద్యార్థిని.. ఓప్రయివేటు డిగ్రీకాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. కాలేజ్ ఫేర్‌వెల్‌ కార్యక్రమం పూర్తయ్యాక.. అందరూ ఫోటోలు దిగారు. ఆ తర్వాత ఆ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి మండపేట బైపాస్ రోడ్‌కు కూతవేటు దూరంలో ఉన్న సంగంకాలనీ రోడ్‌లో ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈలోగా మండపేటకు చెందిన వల్లూరి రామకృష్ణ, సుంకర సత్యనారాయణ, చేమంతి మధు, ములకల వీర బాబు.. ఆ విద్యార్థిని స్నేహితుడిని బెదిరించారు. అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి స్థానిక సత్యశ్రీ థియేటర్ వద్ద బందించారు. మిగిలిన ముగ్గురూ ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు.

ఘటన జరిగాక బాధితురాలు అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆ తర్వాత ఆమె స్నేహితుడు అక్కడి మరికొందరు ఫ్రెండ్స్‌ను తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్లారు. తనపై అత్యాచారం జరిగిన ఘటన ఎవరికీ చెప్పద్దని తన స్నేహితులను వేడుకుంది. ఈ నేపథ్యంలో తమ కళ్లముందే స్నేహితురాలికి జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేని ఫ్రెండ్స్ తన బాధను సోషల్ మీడియాలో బాహ్య ప్రపంచానికి ద్వారా తెలిపారు. ఈ క్రమంలో నిందితులు ఓ వైసీపీ నేతను సహాయం కోసం ఆశ్రయించారు. అయితే అతను మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు ధైర్యం చెప్పడంతో బాధితురాలు మండపేట వచ్చి ఫిర్యాదు చేశారు. బాధితురాలిని కాంగ్రెస్‌ సీనియర్ నేత హర్షకుమార్ పరామర్శించారు. అటు మహిళా సంఘాలు కూడా.. పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకుని బాధితురాలికి మద్దతుగా నిలిచాయి.

Tags

Read MoreRead Less
Next Story