అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సై అంటున్న కాంగ్రెస్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సై అంటున్న కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అంతా సిద్ధమైంది. ప్రజాసమస్యలపై తమ వాయిస్ వినిపించి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇదే కరెక్ట్ టైం అని భావిస్తోంది కాంగ్రెస్. అందుకే బడ్జెట్ సమావేశాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు డిమాండ్ తో ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. రైతుబంధు, నిరుద్యోగ భృతి, పంటలకు మద్దతు ధర, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగాల భర్తీ లాంటి అంశాలపై సర్కార్ ను సభలో ఇరుకున పెట్టేందుకు సిఎల్పీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది.

సీఏఏ, ఎన్‌పిఆర్ లపై అసెంబ్లీ తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. కెసిఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎల్పీ తప్పు పడుతుంది. అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని.. కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే NPR లో తల్లిదండ్రుల కాలం లేకుండా జీవో తీసుకురావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతినీ సైతం అసెంబ్లీలో లేవనెత్తెందుకు సీఎల్పీ ఇప్పటికే కసరత్తు చేసింది. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని ఆరోపిస్తున్న కాంగ్రెస్..ఇదే అంశంపై సభలో చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యా ,వైద్యం పూర్తిగా నిర్లక్ష్యం గురవుతుందని.. కరోణా పై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నా.. ప్రభుత్వం నుంచి చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని కాంగ్రెస్ విమర్శిస్తున్నారు.

ఇక ఈ సారి బడ్జెట్ సమావేశాలను నామ మాత్రంగా కాకుండా ప్రజా సమస్యలపై సూదీర్ఘ చర్చలకు వేదికగా ఉండాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. అందుకే బడ్జెట్ సమావేశాలను 30 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయనుంది.

Tags

Read MoreRead Less
Next Story