కరోనాతో విదేశాంగ మంత్రి సలహాదారు మృతి

X
TV5 Telugu6 March 2020 7:03 PM GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి సలహాదారు హుస్సేన్ షేఖోలెస్లాం కరోనా వ్యాధి బారీన పడి గురువారం రాత్రి మృతి చెందినట్లు అధికారిక ఐఆర్ఎన్ఎ వార్తా సంస్థ నివేదించింది. ఇరాన్ లో ఇస్లామిక్ రిపబ్లిక్లో ఇప్పటివరకు 3,513 మందికి సోకినట్టు.. 107 మంది మరణించినట్టు ఆ దేశం తెలిపింది. కరోనావైరస్ తో మరణించిన వారిలో ఆరుగురు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. హుస్సేన్ షేఖోలెస్లాం సిరియా మాజీ రాయబారిగాను, 1981 నుండి 1997 వరకు ఉప విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 85 దేశాలకు కరోనా వ్యాప్తి చెందింది. 3350 మందికి పైగా కరోనా బారీన పడి మృతి చెందగా, దాదాపు 97500 కరోనా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
Next Story