నీలోఫర్ ఆసుపత్రిలో ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్‌ను పరిశీలించిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్‌ను.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై పరిశీలించారు. మదర్ మిల్క్ బ్యాంక్ ద్వారా అందుతున్న సేవలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. తల్లిపాలు డొనేట్ చేసిన బాలింతలను అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందురోజు.. మదర్ మిల్క్ బ్యాంక్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు తమిళిసై. గ్రామీణ ప్రాంతాల్లో మదర్ మిల్క్ బ్యాంక్‌ల అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవమంటే ఆటపాటలు మాత్రమే కాదని.. సేవాభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
2017లో మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు DME రమేశ్ రెడ్డి. తెలంగాణ నుంచే కాకుండా... ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి చిన్నారులు వస్తున్నారని తెలిపారు. పాలిచ్చే తల్లులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు రమేశ్ రెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com