తాజా వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. అటోను ఢీకొన్న డీసీఎం వాహనం

ఘోర రోడ్డు ప్రమాదం.. అటోను ఢీకొన్న డీసీఎం వాహనం
X

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అటోను డీసీఎం వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. ఇందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దర్ని కర్నూలుకు 9 మందిని, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా వనపర్తి జిల్లా పబ్బేరు మండలం శాఖాపూర్, పెబ్బేరు పట్టణంలో ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్న చర్చిలో ప్రార్థనలు చేసేందుకు వెళ్లి.. సాయంత్రం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Next Story

RELATED STORIES