తాజా వార్తలు

రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు గవర్నర్‌ ప్రసంగంపై చర్చించి ఆమోదించనున్నారు. తరువాత తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. దాదాపు లక్షా 60 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోద ముద్ర వేయడంతోపాటు.. కేంద్రం తీసుకొచ్చిన CAA, NPR , ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నారు.

ఇప్పటికే 12 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈ నెల 20 వరకు జరగనున్న సమావేశాల్లో 9,10,15 తేదీల్లో సెలవులుంటాయని బీఏసీ తెలిపింది. ఈ నెల 20న ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలపనున్నాయి.

Next Story

RELATED STORIES