చిత్తూరు జిల్లా వైసీపీలో రగులుతున్న అంతర్గత పోరు

చిత్తూరు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు రగులుతోంది. నగరి వైసీపీ నాయకుడు కేజే కుమార్ షష్టిపూర్తికి పార్టీ క్యాడర్ ఎవరూ హాజరుకావాల్సిన పనిలేదని జనవరి 31న రోజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆమె ఫోన్ సంభాషణ అప్పట్లో క్యాడర్ లో అసంతృప్తి రగిలించింది. అయితే, కేజే కుమార్ షష్టిపూర్తికి హాజరుకాలేకపోయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. శనివారం ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
అయితే, జనవరి 31న సమయాభావం వల్ల హాజరుకాలేకపోయిన మంత్రులు.. తాజాగా కేజే కుమార్ ను కలవడంతో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో జరగుతున్న తాజా పరిణామాలపై మంత్రలు సమాలోచనలు చేశారు. మరోవైపు, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో.. అభ్యర్థుల ఎంపిక పార్టీని బలోపేతం చేసేవిధంగా పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com