మావోయిస్టుల ఏరివేత కోసం అడవిలోకి లేడీ జవాన్స్

X
TV5 Telugu8 March 2020 5:08 AM GMT
సాధారణంగా మావోయిస్టుల ఏరివేత కోసం... దండకారణ్యంలోకి భద్రతా దళాలుగా మగవారిని పంపిస్తారు. అది కూడా కాల్పుల్లో మంచి స్పెషలిస్టులనే ఎంపిక చేస్తారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకునేందుకు.. చాలా చురుకుగా చాకచక్యంగా వ్యవహరించే వారినే కూంబింగ్‌కు అడవిలోకి పంపిస్తారు. కానీ మహారాష్ట్రలో లేడీ జవాన్స్ రంగంలోకి దిగారు. గడ్చిరౌలీలోని డీప్ ఫారెస్టులో మావోయిస్టుల కదలిక ఉందన్న సమాచారంతో.. మహిళా భద్రతా దళాలు కూంబింగ్‌కు వెళ్లారు. నక్సల్స్ కోసం అడవిలో వేట కొనసాగించారు. అక్కడి గిరిజన గ్రామాల ప్రజలతో మమేకమై.. నక్సల్స్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. వారిని చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. అతివలు ఎందులోనూ తక్కువ కాదని మహారాష్ట్ర మహిళా భద్రతా దళాలు నిరూపించాయి.
Next Story