యానగొంది క్షేత్రం మాత మాణికేశ్వరి శివైక్యం...

యానగొంది క్షేత్రం మాత మాణికేశ్వరి శివైక్యం...
X

ఆమెకు దైవ చింతనే లోకం. లోక కళ్యాణార్ధం ప్రార్ధనతోనే జీవితాన్ని గడిపేసిన మహాయోగిని. కదిలే దైవం ఈ అమ్మ. దైవాంశసంబూతిరాలుగా కొలుచుకునే మహాసాధ్విని ఈ లోకం విడిచి శివైక్యం చెందారు. 86 ఏళ్ల మాతా మణిక్వేశ్వరి కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు. నిన్న రాత్రి 8 గంటల 50 నిమిషాలకు ఆరోగ్యం విషమించటంతో ఆమె ఆఖరి శ్వాస విడిచారు. కర్ణాటక - తెలంగాణ సరిహద్దుల్లోని యానాగొంది క్షేత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

పెళ్లి, సంసారం, కుటుంబ జీవితాన్ని త్యజించి చిన్ననాటి నుంచే దైవచింతనలో గడిపారు మాతా మణికేశ్వరి. అహింస పరమో ధర్మమే లక్ష్యంగా బోధనలు గావిస్తూ ప్రజలకు చేరువైన మాతామాణికేశ్వరి కర్ణాటకలోని సేడం తాలూకా మల్హాబాద్‌లో ఆశమ్మ, బుగ్గప్పలకు 26 జూలై 1934లో జన్మించారు. నాలుగో కుమార్తె ఆయిన మణికేశ్వరికి 9 ఏళ్లకే బాల్య వివాహం చేశారు. అయినా..ఆమెలో దైవచింతన తొలిగిపోలేదు. వివాహం చేసినా సంసారిక జీవితానికి దూరంగా ఉంటూ వచ్చా రు. మల్హాబాద్‌ పక్కనే ఉన్న ఏకాంబరి గుట్టల ప్రాంతంలో మేకలను కాస్తూ, ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్యానంలో ఉండేవారు.

మహాయోగిని మణికేశ్వరికి ఎన్నో మహిమలు ఉన్నాయని చెబుతుంటారు. యానగుందిలో ఆమె నీటితో దీపాలు వెలిగించేవారని, 75ఏండ్లుగా ఆహారం తీసుకోకుండా ఉంటున్నారని భక్తులు చెబుతుంటారు. ఏటా శివరాత్రికి, గురుపూజోత్సవం రోజు భక్తులకు దర్శనం ఇచ్చేవారు.ఆమె చివరి సారిగా గత నెల 21న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు దర్శనమిచ్చారు.

మాతా మణికేశ్వరి ఇక లేరని వార్తతో ఆమె భక్తులు పెద్ద సంఖ్యలో ఆశ్రమానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఉదయం పది గంటల నుంచి మూడు రోజులపాటు ఆమె పార్థివదేహాన్ని భక్తుల సందర్శనార్థం ఆశ్రమం లో ఉంచుతారు.

Next Story

RELATED STORIES