ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో కొత్త పొత్తు తెరపైకి

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో కొత్త పొత్తు తెరపైకి

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో కొత్త పొత్తు తెరపైకి వస్తోంది. ఇప్పటికే బీజేపీ-జనసేన కలిసి బరిలో దిగుతుంటే.. వామపక్షాలతో కలిసి బరిలో దిగేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు సానుకూలంగా సాగుతున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. సీపీఐ పార్టీ పొత్తుకు సిద్ధంగా ఉందని.. సీపీఎం కూడా త్వరలోనే నిర్ణయం చెబుతుందని.. ఈ పొత్తుపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న..

కార్పొరేషన్‌ ఎన్నికల్లో 64 స్థానాలకు టీడీపీ సమర్థవంతమైన వారికి టికెట్లు ఇస్తుందన్నారు బుద్ధా వెంకన్న. వైసీపీ వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పెన్షన్లు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్లు బెదిరిస్తే వాలంటీర్లను క్షమించేది లేదన్నారు బుద్ధా వెంకన్న.

Tags

Read MoreRead Less
Next Story