పెట్రోలియం రంగానికి కరోనా షాక్ .. భారీగా తగ్గిన ముడి చమురు ధరలు

పెట్రోలియం రంగానికి కరోనా షాక్ .. భారీగా తగ్గిన ముడి చమురు ధరలు

కరోనా వైరస్ పెట్రోలియం రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. చమురు ధరులు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే ఏకంగా 25 శాతానికి పైగా దిగజారాయి. బ్రెంట్ క్రూడ్ ధర 26 శాతం తగ్గి బ్యారెల్‌ కు 33.66 డాలర్లకు పడిపోయింది. డబ్లూటీఐ క్రూడ్ ధర 27 శాతం తగ్గి బ్యారెల్‌కు 30.35 డాలర్లకు తగ్గింది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత ముడి చమురు ధరలు ఇంతలా పతనం కావడం ఇదే తొలిసారి.

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ భారీగా తగ్గిపోయింది. డిమాండ్ తగ్గడంతో చమురు ఉత్పత్తి తగ్గించాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ అంశంపై ఒపెక్ దేశాలు, రష్యా మధ్య చర్చ లు జరిగాయి. ఐతే, ఆ చర్చలు విఫలమయ్యాయి. దాంతో రష్యా, ఒపెక్ దేశాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇదే అదనుగా సౌదీ అరేబియా చమురు ధరలను భారీగా తగ్గించింది. తమ ఉత్పత్తు లకు డిమాండ్ కాపాడుకోవడానికి ఒపెక్ దేశాలు ముడి చమురు ధరను తగ్గించాయి. అలాగే, రాబోయే రోజుల్లో ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని ఆరామ్‌కో భావిస్తోంది. అదే జరిగితే చమురు ధరలు మరింత తగ్గుతాయని అంటున్నారు. సౌదీ ప్రైస్‌ వార్‌తో ఆసియాలో బ్యారెల్‌ ముడిచమురు ధర ఏకంగా 32 డాలర్లకు పడిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story