Top

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
X

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 15 మున్సిపల్ కార్పొరేషన్ లకు గాను 12 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్ తెలిపారు. కోర్టు స్టేల కారణంగా శ్రీకాకుళం, నెల్లూరు, రాజమండ్రి కార్పొరేషన్లకు ఎన్నికలు జరపడం లేదన్నారు.

ఇక 104 మున్సిపాలిటీల్లో 75 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. కోర్టు వివాదాలు, పంచాయితీల విలీనంపై స్టే కారణంగా 16 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. మరోవైపు కొత్తగా ఏర్పడిన 12 మున్సిపాలిటీల్లో ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు.

ఇక, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11 నుంచి13 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. 23న పోలింగ్ జరుగుతుందని.. ఒకవేళ ఏమైనా రీపోలింగ్ చేయాల్సివస్తే 26న నిర్వహిస్తామని అన్నారు. ఇక 27న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామన్నారు రమేష్‌ కుమార్.

Next Story

RELATED STORIES