కర్ణాటకను వెంటాడుతోన్న 'కరోనా'..

కర్ణాటకను వెంటాడుతోన్న కరోనా..

కర్ణాటకను కరోనా వైరస్‌ భయం వెంటాడుతోంది. తాజాగా నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ణాటక సర్కార్‌ అప్రమత్తం అయింది. ఐటీ హబ్‌గా ఉన్న బెంగళూరకు విదేశాల నుంచి టెక్కీలు వస్తుండడంతో కరోనా భయం ఇంకాస్త వెంటాడుతోంది. ఇప్పటికే వ్యాధి లక్షణాలు ఉన్న నలుగుర్ని రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ చెస్ట్‌ డిసీజెస్‌ హాస్పిటల్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. ముందస్తుగా వారి భార్య, పిల్లలను కూడా ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వారి సహోద్యోగులు, ఫ్లైట్‌ లో వారితోపాటు ముందు వెనకా ప్రయాణించిన వారు, వారితో సంబంధాలు కలిగి ఉన్న మరో 2666 మందిని గుర్తించారు. వారిలో ఇప్పటికే కొందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే అధికారికంగా దృవీకరించింది.

మరోవైపు కేరళలోనూ వైరస్‌ విజృంభన కొనసాగుతోంది. ఆరుగురిలో కరోనాకు పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. కరోనాని కట్టడి చేశామని ఓ పక్క కేరళ ప్రభుత్వం చెబుతుంటే.. రోజు రోజుకూ పాజిటివ్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story