స్టాక్‌మార్కెట్లకు కరోనా దెబ్బ

స్టాక్‌మార్కెట్లకు కరోనా దెబ్బ

దేశీయ మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. కరోనా వైరస్ స్టాక్ మార్కెట్లను ఘోరంగా దెబ్బతీసింది. స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 2350 పాయింట్లు కోల్పో యింది. నిఫ్టీ సుమారు 630 పాయింట్లు నష్టపోయింది. ఈ దెబ్బతో నిఫ్టీ 15 నెలల కనిష్టానికి పడిపోయింది. 11 కీలక సూచీలు నష్టాల పాలయ్యాయి. చమురు, బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్ సహా కీలక రంగాల షేర్లు విపరీతంగా దిగజారాయి. దేశీయ మార్కెట్లు ఇంతలా దిగజారడం గత ఏడాది కాలంలో ఇదే మొదటిసారి.

కరోనా ఎఫెక్ట్‌తో అంతర్జాతీయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఇది పెట్టుబడిదారులను భయాందోళనకు గురి చేస్తోంది. దాంతో మార్కెట్ సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతింటోంది. కొనుగోళ్లు తగ్గిపోయి అమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఇప్పట్లో కరోనా ప్రభావం తగ్గదనే వార్తలతో షేర్ హోల్డర్లు తమ వాటాలను తెగనమ్ముకుంటున్నారు. ఇన్వెస్టర్లకు అమ్మకాలకే మొగ్గుచూపుతుండడంతో మార్కెట్లు బేర్‌మంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story