తాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్‌పోర్టును సందర్శించిన మంత్రి ఈటల

శంషాబాద్ ఎయిర్‌పోర్టును సందర్శించిన మంత్రి ఈటల
X

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శంషాబాద్ ఎయిర్‌పోర్టును సందర్శించారు. ఇంటర్నేషనల్ టర్మినల్‌లో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్‌ను పరిశీలించారు. కరోనా వైరస్‌ను గుర్తించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒకటే కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అది కూడా దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికే వైరస్ సోకింది. ప్రధానంగా ఇతర దేశాల నుంచి వస్తున్న వారితోనే కరోనా వైరస్ వస్తుండటంతో స్క్రీనింగ్ కేంద్రాల్లో మరింత జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఈటల.

Next Story

RELATED STORIES