రాజన్నసిరిసిల్ల జిల్లా రైతులకు నష్టం కల్గించిన అకాల వర్షాలు

రాజన్నసిరిసిల్ల జిల్లా రైతులకు నష్టం కల్గించిన అకాల వర్షాలు
X

అకాల వర్షాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. గత రాత్రి కురిసిన వర్షానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో కందులు తడిసి ముద్దయ్యాయి. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన రైతులు భారీగా కందులను మార్కెట్ కు తీసుకొచ్చారు. గత రాత్రి ఒక్కసారిగా వర్షం కురియడంతో మార్కెట్ యార్డులో ఉన్న 2వేల 5వందల క్వింటాళ్ల కందులు పూర్తిగా తడిసిపోయాయి. చేతికొచ్చిన పంట ఇలా వర్షం పాలుకావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజులక్రితమే మార్కెట్ కు కందులను తీసుకొచ్చామని, తేమ శాతం ఎక్కువగా ఉందని అధికారులు చెప్పడంతో మార్కెట్లో ఆరబెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులక్రితమే మార్కెట్ కు వచ్చినా ... కందులు తమ పొలంలో పండినట్లు అధికారులవద్ద సర్టిఫికెట్ తేవాలని అధికారులు అనడంతో ఆలస్యమై ఇప్పుడు వర్షం పాలైందని మరికొందరు అన్నదాతలు అంటున్నారు. తడిసిన కందులను కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story