బీజేపీ-జనసేన కీలక నిర్ణయం.. పోటీ చెయ్యడమే కాదు.. పోరాటం కూడా

బీజేపీ-జనసేన కీలక నిర్ణయం.. పోటీ చెయ్యడమే కాదు.. పోరాటం కూడా

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికే పరిమితం కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలపైనా ఉమ్మడిగా పోరాటం చేయాలని బీజేపీ-జనసేనలు నిర్ణయించాయి. విశాఖలో రెండు పార్టీలు సుదీర్ఘంగా ఉమ్మడి సమావేశం నిర్ణయించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీలు స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో సింగిల్‌ ఫార్ములాతో ప్రజల ముందుకు వెళ్లాలని ఇరు పార్టీల సీనియర్‌ నేతలు నిర్ణయించారు.

ఏపీలో బీజేపీ-జనసేన కూటమి బలమైన శక్తిగా ఎదిగిందన్నారు ఎమ్మెల్సీ మాధవ్‌. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కూటమి అన్ని చోట్ల పోటీ చేస్తుందని.. టీడీపీకి అన్ని చోట్ల అభ్యర్థులు దొరికే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమికి పట్టం కడితే విశాఖ కార్పొరేషన్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని మాధవ్‌ హామీ ఇచ్చారు.

చారిత్రక అవసరం దృష్ట్యా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్‌. తమది సమాజ హితం కోసం పెట్టుకున్న పొత్తు అని వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

మొత్తంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఆశిస్తున్నారని, ఈ ఎన్నికల్లో తమ పొత్తు అద్భుత ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story