ట్రంప్‌లో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవు : వైట్ హౌజ్ ప్రతినిధి

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. ఇప్పుడు దేశాధినేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. కొద్దిరోజులక్రితం జరిగిన ఓ సమావేశంలో ఇద్దరు కరోనా సోకిన ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిశారన్న వార్తలు పెను సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సైతం కరోనా వైద్యపరీక్షలు నిర్వహించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై ఏకంగా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదని స్పష్టంచేసింది. ఆయనలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని వైట్ హౌజ్ ప్రతినిధి స్టెఫానీ గ్రీషన్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ పై ట్రంప్ అందరికంటే భిన్నంగా స్పందించారు. సాధారణ ఫ్లూతో గత ఏడాది 37వేలమంది అమెరికన్లు మరణించారని, ఈ ఫ్లూ వల్ల జనజీవనం,ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడలేదని ట్విట్టర్ లో తెలిపారు. కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు 24మంది మరణించారు. 514మందికి వైరస్ సోకింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com