ఖమ్మం లేబర్ అసిస్టెంట్ అధికారి ఆనంద్ రెడ్డి హత్య

X
TV5 Telugu10 March 2020 8:21 PM GMT
వరంగల్ జిల్లాలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఖమ్మం లేబర్ అసిస్టెంట్ అధికారి ఆనంద్ రెడ్డి హత్యకు గురయ్యారు. భూపాలపల్లి జిల్లా గోళ్ల బుద్ధారం అటవీ ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆనంద్‌ను హత్య చేసినట్లు వ్యాపారి ప్రదీప్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఓ లావాదేవీ వ్యవహారంలో రూ.80 లక్షలు ఇస్తానంటూ ప్రదీప్, ఆనంద్‌ను భూపాలపల్లికి పిలిచాడు. ఆ తర్వాత నుంచి ఆనంద్ కనిపించలేదు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం బయటకు వచ్చింది.
Next Story