కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల దౌర్జన్యం

X
TV5 Telugu10 March 2020 11:19 PM GMT
కర్నూలు జిల్లాలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. చిప్పగిరి మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్ధి రజని నామినేషన్ పత్రాలను వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు చించేశారు. వైసీపీ నేతల దౌర్జనాన్ని అక్కడి పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకోకపోవడం విశేషం. పైగా వైసీపీ నేతలకు.. వీరు వంతపాడుతున్నారు. విషయం తెలుసుకుని.. ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ హూటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story