హద్దులు దాటుతున్న అధికార పార్టీ అరాచకాలు

హద్దులు దాటుతున్న అధికార పార్టీ అరాచకాలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అరాచకాలు హద్దులు దాటుతున్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే పోలీసులు పని చేస్తుండడంతో ఆ పార్టీ వర్గీయులు రెచ్చిపోతున్నారు. విపక్షాల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు కనీసం నామినేషన్‌ వేయడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఎవరైనా నామినేషన్లు వేడయానికి వెళ్తే వారిని మాటలతో బెదిరిస్తున్నారు. అయినా వెనక్కు తగ్గకపోతే దాడులకు తెగబడుతున్నారు. ఒకటి రెండు చోట్ల కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మొన్న చిత్తూరు.. నిన్న కర్నూలూ.. ఇవాళ గుంటూరు.. శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా.. ఇలా ఎక్కడ చూసినా వైసీపీ నేతల అరాచకాలతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది.

రాళ్లు, కర్రలతో నేతలపై దాడులకు తెగబడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీ అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని పోలీస్‌ స్టేషన్లకు వెళ్తే అక్కడ పట్టించుకోవడం లేదు. ఎవరైతే బాధితులో తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ ఆదేశాలతో పోలీసుల కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఎన్నికల అధికారులు హెచ్చరికలు.. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయని అధికారపార్టీ.. దౌర్జన్యాలకు తెరలేపింది. ఓవైపు ప్రలోభ పర్వాలు కొనసాగిస్తోంది. అక్కడితో ఆగకుండా ఎవరైనా నామినేషన్లు వేయడానికి వెళ్తే వారిపై దాడులకు పాల్పడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story