విడుదల కానున్న బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో

విడుదల కానున్న బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో
X

బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కానుంది. కాసేపట్లో రెండు పార్టీల అధ్యక్షులు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్‌తోపాటు రెండు పార్టీల ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక పోరులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పవన్ ఛరిష్మాను వాడుకుంటూ జనంలోకి వెళ్లాలని BJP భావిస్తోంది. దీంట్లో భాగంగానే జిల్లాల్లో పవన్ కల్యాణ్‌ టూర్లు, గ్రామాల మీదుగా రోడ్‌షోలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై గురువారం పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

బీజేపీ-జనసేన మేనిఫెస్టోలో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసేలా కొన్ని అంశాలు పొందు పరచనున్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టి గ్రామాల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు పవన్, కన్నా. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం కూడా కొన్ని కేంద్ర పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుని మోసం చేస్తున్నాయని మండిపడుతున్నారు. పట్టణాల్లో ఫ్లై ఓవర్లు, గ్రామాల్లో రోడ్లు పూర్తికి కేంద్రం నిధులను తెప్పించి అభివృద్ధి పనులువేగంగా జరిగేలా చూస్తామంటున్నారు

Tags

Next Story