ఇటలీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు

ఇటలీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు

కరోనా వైరస్ ఎఫెక్ట్‌తోఉక్కిరి బిక్కిరవుతున్న ఇటలీలో 70 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. ఇందులో పలువురు తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్వదేశానికి చేరుకునేందుకు రోమ్‌ విమానాశ్రయానికి వచ్చిన స్టూడెంట్స్‌.. 24 గంటల నుంచి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. భారత్‌కు వచ్చేందుకు ఎమిరేట్స్‌ గానీ, ఎయిరిండియా గానీ బోర్డింగ్‌ పాస్‌లు ఇవ్వడం లేదని వాపోతున్నారు. కరోనా వైరస్‌ సోకలేదని ధ్రువీకరణ పత్రం తెస్తేనే బోర్డింగ్‌ పాస్‌ ఇస్తామని చెబుతున్నారు అధికారులు. అయితే ఇటలీలో అలాంటి ధ్రువపత్రాలు ఎవరూ ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

అయితే సర్టిఫికెట్‌ లేనిదే పంపవద్దని భారత్‌ ఆంక్షలు విధించిందని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇటలీలో ఉండలేక.. ఇండియా రాలేక స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతి, భోజన సదుపాయాలు లేక ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. భారత్‌కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విద్యార్థులు లేఖ రాశారు.

Tags

Read MoreRead Less
Next Story