పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన రజిని

పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన రజిని
X

తమిళనాడు ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి లేదని నటుడు రజనీకాంత్ తేల్చేశారు. త్వరలో రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు రజిని స్పష్టం చేశారు. గురువారం చెన్నైలోని ఓ హోటల్‌లో తన రాజకీయ రోడ్‌మ్యాప్‌ను వెల్లడించారు. ఈ సందర్బంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. వ్యవస్థను మార్చాలన్న లక్ష్యంతోనే తాను రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తాను కేవలం అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని అన్నారు. పార్టీలోకి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆహ్వానిస్తున్నానని.. తాను ఏర్పాటు చేయబోయే పార్టీలో యువతకు ప్రాధ్యాన్యత ఎక్కువగా ఉంటుందని.. వారికే 65 శాతం సీట్లు కేటాయిస్తామని తెలిపారు.

Next Story

RELATED STORIES