ఏపీలో స్థానిక ఎన్నికలు : అధికార వైసీపీలో చిచ్చు

ఏపీలో స్థానిక ఎన్నికలు అధికార వైసీపీలో చిచ్చు రాజేస్తున్నాయి. సొంత పార్టీలో అసమ్మతికి కారణమవుతున్నాయి.. ఇప్పటికే అనేక చోట్ల వైసీపీ నేతలు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడుతుంటే.. పశ్చిమగోదావరి జిల్లాలోనూ అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి.. ఏలూరులో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. అసమ్మతి వర్గానికి చెందిన నేతలు పెద్ద సంఖ్యలో రావడంతో అలజడి రేగింది..
ఆళ్ల నాని ఇంటి వద్ద బైఠాయించిన వారంతా న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు.. నగర మేయర్ పదవిని ఆశించి భంగపడ్డ బొద్దాని శ్రీనివాస్ అనే వైసీపీ నేత కన్నీటి పర్యంతమయ్యారు.. శ్రీనివాస్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో డిప్యూటీ సీఎం ఇంటి దగ్గరకు చేరుకుని ఆందోళన చేస్తున్నారు.. ప్రస్తుతం అక్కడ పరిస్థి ఉద్రిక్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com