ఇటలీలో వెయ్యి దాటిన కరోనావైరస్ మరణాలు

ఇటలీలో వెయ్యి దాటిన కరోనావైరస్ మరణాలు
X

చైనాలో ఉద్భవించిన కరోనావైరస్ కారణంగా ఆ దేశంలో 3 వేలకు పైగా మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఇటలీలో తాజాగా వెలువడిన లెక్కల ప్రకారం ఆ దేశంలో 1000 మందికి పైగా మరణించినట్టి నివేదికలు వెలువడ్డాయి. దీంతో ఇటలీ అధికారులు పూర్తిస్థాయిలో వైరస్ కట్టడి చర్యలకు ఉపక్రమించారు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, బార్‌లు మరియు హోటళ్లు మినహా దాదాపు అన్ని దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. గురువారం ఒక్కరోజే మరణాల సంఖ్య 189 పెరిగి మొత్తంగా 1,016 కు చేరుకుంది. గతంలో 12,462 నుండి ధృవీకరించబడిన కేసులు ఉండగా అవి 15,113 కు పెరిగాయి.

Tags

Next Story