తాజా వార్తలు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తాం: కేసీఆర్

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తాం: కేసీఆర్
X

పల్లె ప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మారుస్తామన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ అసెంబ్లీలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, చేతివృత్తులు, కులవృత్తులకు అవసరమైన చేయూత అందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. ప్రజా సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవనభద్రత కల్పిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్‌.

దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు సీఎంకేసీఆర్‌. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వందశాతం వైకుంఠధామాలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణను చేస్తామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్‌.

Next Story

RELATED STORIES