సీఎం జగన్‌ చెప్పిన మాటలు నీటిమీద రాతలేనని తేలిపోయింది..

సీఎం జగన్‌ చెప్పిన మాటలు నీటిమీద రాతలేనని తేలిపోయింది..

స్థానిక సంస్థల ఎన్నికల్లో... నేర చరితులు, మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులకు అవకాశం ఇవ్వొద్దని సీఎం జగన్‌ చెప్పిన మాటలు నీటిమీద రాతలేనని తేలిపోయింది. విశాఖ GVMC ఎన్నికల కోసం YCP ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో... నేర చరితులు, ప్రజాప్రతినిధులకే పెద్దపీట వేశారన్నది కళ్ల ముందు కనిపిస్తోంది. రాష్ట్రంలోనే సంచలనం రేపిన గేదెల బాలరాజు హత్యకేసులో ప్రధాన నిందితుడు భూపతిరాజు భార్య సుజాతకు 73వ వార్డు సీటు కేటాయించారు. భూ కబ్జాలు, ఇతర నేరాలతోపాటు గేదెల రాజు హత్య కేసులో... నిందితుడు దామా సుబ్బారావుకు 86వ వార్డు కేటాయించారు.

నేర చరితులతోపాటు... మంత్రులు, ఎమ్మెల్యే బంధువులు కూడా... స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగుతున్నారు. మంత్రి అవంతి కుమార్తె ముత్తం శెట్టి ప్రియాంక భీమిలిలో 6వ వార్డు నుంచి పోటీకి రెడీ అయ్యారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డికి 74వ వార్డు కేటాయించారు. అయితే... అభ్యర్థుల ఎంపిక నిస్పాక్షికంగా, పారదర్శకంగా, శాస్త్రీయంగా జరిగిందని మంత్రి అవంతీ చెప్పడం కొసమెరుపు.

Tags

Read MoreRead Less
Next Story