రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం
X

రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రయిలర్ ట్రక్, జీప్ ఎదురెదురుగా ఢీకొనడంతో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జోధ్పూర్ జిల్లాలోని బలోత్రా-ఫలోడి హైవేపై ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను బలోత్రా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story

RELATED STORIES