పోలీసులు మమ్మల్ని బెదిరిస్తున్నారు : బీజేపీ MPTC అభ్యర్థులు

కర్నూల్‌ జిల్లా నంద్యాలలో టూ టౌన్‌ పోలీసులు బెదిరిస్తున్నారని బీజేపీ MPTC అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గోస్పాడు మండలంలో వేసిన నామినేషన్‌లు ఉపసంహరించుకోవాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని బీజేపీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వార్నింగ్‌లతో భయపడ్డ బీజేపీ MPTC అభ్యర్థులు బీజేపీ నేత అభిరుచి మధు ఇంట్లో తలదాచుకున్నారు. జిల్లాలో పోలీసుల అరాచకాలపై... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్లినట్టు నేతలు చెబుతున్నారు.

Tags

Next Story