Top

వైసీపీ దాడులపై ఎన్నికల సంఘానికి లేఖ రాసిన చంద్రబాబు

వైసీపీ దాడులపై ఎన్నికల సంఘానికి లేఖ రాసిన చంద్రబాబు
X

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి రెండు లేఖలు రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. గుంటూరు జిల్లా మాచర్ల, అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను వైసీపీ శ్రేణులు చించేసి దౌర్జన్యం చేశారని.. నామినేషన్‌ పత్రాలు చించేసిన అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని లేఖలో కోరారు.

తెనాలిలో టీడీపీ అభ్యర్థి ఇంట్లో దుండగులు అక్రమంగా మద్యం పెట్టారంటూ ఎన్నికల సంఘానికి మరో లేఖ రాశారు టీడీపీ అధినేత. ఎక్సైజ్ పోలీసులు నేరుగా వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి మద్యం తీశారని.. మద్యాన్ని దుండగులు పెట్టిన దృశ్యాలు స్పష్టంగా రికార్డ్‌ అయ్యాయని లేఖలో తెలిపారు. తన నివాసంలో అక్రమంగా మద్యం పెట్టారంటూ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు, పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

Next Story

RELATED STORIES