బ్రేకింగ్.. భారత ఆర్మీకి పాకిన కరోనా వైరస్

బ్రేకింగ్.. భారత ఆర్మీకి పాకిన కరోనా వైరస్
X

కరోనా వైరస్.. ఈ పేరు చెబితేనే చాలా మంది వణుకుతున్నారు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదకర కరోనా వైరస్‌ ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి సైతం పాకింది. పంజాబ్‌ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఆర్మీ జవాను కరోనా లక్షణాలతో బాధపడుతునట్లు గుర్తించారు. దీంతో అతన్ని దగ్గరలోని హాస్పటల్ లో చేర్పించారు. డాక్టర్ల పర్యవేక్షణలో అతనికి టెస్ట్‌లు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. అయితే కరోనా సోకిన జవాను ఇటీవల ఇటలీ పర్యటను వెళ్లి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇటలీ పర్యటన అనంతరం మార్చి 11న మానేసర్‌లోని ఆర్మీ క్యాంపుకు వచ్చారని, ఈ నేపథ్యంలోనే వైరస్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.

Next Story

RELATED STORIES