తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. గాంధీ ఆస్పత్రికి కరోనా లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.. తెలంగాణలో భయపడాల్సిన పరిస్థితి లేకపోయినా, ఏపీలో మాత్రం ఈ వైరస్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.. ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన ఓ యువకుడికి కరోనా వైరస్‌ సోకింది.. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.. అయితే, 14 రోజుల పర్యవేక్షణ తర్వాత కోలుకుంటున్నట్లు నిర్ధారణ అయితే, డిశ్చార్జ్‌ చేస్తామని చెబుతున్నారు.

కరోనా పాజిటివ్‌ కేసు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.. జిల్లాలోనూ అధికారులు హై అలెర్ట్‌ ప్రకటించారు. స్కూళ్లకు సెలవిచ్చారు.. మరోవైపు సూళ్లూరుపేటలో ముగ్గురు కరోనా అనుమానితులను గుర్తించారు.. వారికి నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కడప జిల్లాలోనూ కరోనా అనుమానిత లక్షణాలతో ఇద్దరు రిమ్స్‌లో చేరడం కలకలం రేపుతోంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారిద్దరికీ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి శాంపిల్స్‌ పుణె ల్యాబ్‌కు పంపించారు వైద్యులు. ఇక కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు టీటీడీ కూడా చర్యలు తీసుకుంటోంది. అలిపిరి టోల్‌గేట్‌, శ్రీవారి మెట్టు, అలిపిరి కాలినడక ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో వచ్చే భక్తులకు శానిటైజర్లను అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story